Mon Dec 23 2024 00:06:55 GMT+0000 (Coordinated Universal Time)
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా..!
జవాన్ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ. ఆల్రెడీ కథ వినిపించాను అంటూ..
తమిళ దర్శకుడు అట్లీ చాలా తక్కువ సినిమాలతోనే సౌత్ టు నార్త్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. రాజారాణి, తెరి, మెర్సల్, బిగిల్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకొని ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు. ఇక సినిమాలో హీరో పాత్రని అట్లీ ఎలివేట్ చేసే విధానం ఆడియన్స్ ని మాత్రమే కాదు హీరోలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది. దీంతో అట్లీ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఈక్రమంలోనే ఏకంగా బాలీవుడ్ బాద్షా 'జవాన్' (Jawan) సినిమా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక అట్లీ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. కాగా అట్లీ అండ్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. తాజాగా జవాన్ ప్రమోషన్స్ లో దీని గురించి అట్లీని ప్రశ్నించారు.
దీనికి అట్లీ బదులిస్తూ.. "ఆల్రెడీ అల్లు అర్జున్ కి ఒక కథ వినిపించాను. ప్రస్తుతం ఆ కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ ఇస్తాము" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అట్లీ ఎలివేషన్స్ కి అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్ తోడైతే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) లో నటిస్తున్నాడు.
ఆ తరువాత సందీప్ వంగ, త్రివిక్రమ్ సినిమాలు వరుసలో ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయ్యిన తరువాతే అల్లు అర్జున్, అట్లీ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఆ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అనుకుంటే. మరి ఈ ప్రాజెక్ట్ ఒకే అవుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి. కాగా పుష్ప 2 షూటింగ్ ఈ ఏడాది చివరిలో పూర్తి కానుందట. ఆ తరువాత వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సందీప్ వంగా సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story