Thu Dec 19 2024 14:56:23 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : రజినీని మించిపోయిన అల్లు అర్జున్.. ఏ విషయంలో..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ని మించిపోయిన అల్లు అర్జున్. ఏ విషయంలో తెలుసా..?
Allu Arjun : ఒకప్పుడు నార్త్ ఆడియన్స్ కి సౌత్ హీరోలు అంటే.. కేవలం రజినీకాంత్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్, అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులోకి వచ్చి చేరారు. వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ భారీ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం నార్త్ లో ఏ సౌత్ స్టార్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈ హీరో ఓ విషయంలో రజినీని మించి పోయారు.
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కోసం ఇండియా వైడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సైతం పుష్ప 2 కోసం ఎదురు చుస్తున్నామంటూ చెబుతున్నారంటే.. ఆ మూవీ పై ఎంతటి బజ్ ఉందో అర్ధం చేసుకోండి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఇది బాహుబలి 2 రికార్డుని అందుకున్న సందేహ పడనవసరం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బన్నీ కూడా భారీ మొత్తంలో తీసుకుంటున్నారట.
అయితే ఇది రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా.. సినిమా బిజినెస్ లో వాటా తీసుకుంటున్నారట. మూవీ బిజినెస్ లో 30 శాతం అల్లు అర్జున్ ఛార్జ్ చేస్తున్నారట. పుష్ప 2కి దేశవ్యాప్తంగా 1000 కోట్ల వరకు బిజినెస్ జరుగబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనిబట్టి చూస్తే అల్లు అర్జున్ ఈ సినిమాకి దాదాపు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలోనే బన్నీ రజినీని మించిపోయారు.
ఇటీవల 'జైలర్' సినిమాకి గాను రజినీ.. 200 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. సౌత్ లో ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా రజినీ ప్రస్తుతం మొదటిస్థానంలో ఉన్నారు. ఇప్పుడు పుష్ప 2కి 300 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంటూ ఫస్ట్ ప్లేస్ ని అల్లు అర్జున్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా పుష్ప 2 వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది.
Next Story