Thu Dec 19 2024 13:06:39 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అల్లు అర్జున్ ‘మైనపు విగ్రహం’ ఓపెనింగ్ అప్పుడే..
ప్రపంచ ప్రసిద్ధి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణకు డేట్ ఫిక్స్ అయ్యింది.
Allu Arjun : ప్రపంచ ప్రసిద్ధి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తమ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోయారు.
మ్యూజియం వారు విగ్రహ ఏర్పాటు చేయడం కోసం అల్లు అర్జున్ కొలతలు తీసుకోని దాదాపు ఆరు నెలలు పైనే అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆ మైనపు విగ్రహాన్ని ఓపెన్ చేయలేదు. దీంతో బన్నీ అభిమానులంతా ఆ విగ్రహ ఓపెనింగ్ కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. అయితే ఆ తరువాత ఇప్పుడు వచ్చేసింది. మార్చి 28న రాత్రి 8 గంటలకు దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని మ్యూజియం వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కాగా ఆ విగ్రహం 'అల వైకుంఠపురములో' మూవీలోని పాత్ర గెటప్‌లో ఉండి, పుష్ప మ్యానరిజంతో కనిపించబోతుంది. అల్లు అర్జున్ కూడా ఈ విగ్రహావిష్కరణకు వెళ్ళబోతున్నారు. ఇక ఈ గుడ్ న్యూస్ తో అల్లు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ మైనపు విగ్రహాలను ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
అయితే ప్రభాస్ అండ్ మహేష్ విగ్రహాలు ఉన్నదీ లండన్ మ్యూజియంలో. మేడమ్ టుస్సాడ్స్ సంస్థకి వరల్డ్ వైడ్ గా మ్యూజియంలు ఉన్నాయి. ఈక్రమంలోనే దుబాయ్ లో కూడా ఒక మ్యూజియం ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ మ్యూజియంలో విగ్రహావిష్కరణ జరుపుకుంటున్న తొలి తెలుగు యాక్టర్ అయితే అల్లు అర్జునే.
Next Story