Fri Dec 20 2024 10:23:50 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి ఒట్టి ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్
'పుష్ప 2: ది రూల్' నుండి ట్రైలర్ వచ్చేసింది. నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 17 ఆదివారం బీహార్‌లోని పాట్నాలో విడుదల చేశారు. గ్రాండ్ ట్రైలర్లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా ఈసారి ఇంటర్నేషనల్ లెవల్ కు ఎదగడం చూడొచ్చు. ట్రైలర్ డ్రామా, మిస్టరీ, యాక్షన్, మ్యూజిక్, రొమాన్స్ అన్ని అంశాలతో కలిసి ఉంది.
ముఖ్యంగా సినిమా అత్యంత గ్రాండ్ గా.. మంచి కిక్ ఇచ్చే సీన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. పుష్ప: ది రైజ్‌లో తక్కువ స్క్రీన్ టైమ్ ఫహద్ ఫాసిల్ కు ఉంది. పుష్ప: ది రూల్‌లో మరింత బలమైన పాత్రలో కనిపిస్తాడు. ట్రైలర్ కూడా అదే సూచిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 మొదటి భాగం ముగిసిన చోటనే ప్రారంభమవుతుంది. మొదటి పార్ట్ లో సమంత తన డ్యాన్స్ నెంబర్ తో సంచలనం సృష్టించగా, సెకండ్ పార్ట్ లో నటి శ్రీలీల డ్యాన్స్ నంబర్ ను చూడబోతున్నాం.
Next Story