నవంబర్ వరకు వెయిట్ చెయ్యాలా బన్నీ..!!
కరోనా గిరోనా జన్తా నై అంటూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కోసం హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కి రెడీ అవడము… పట్టాలెక్కించడం [more]
కరోనా గిరోనా జన్తా నై అంటూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కోసం హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కి రెడీ అవడము… పట్టాలెక్కించడం [more]
కరోనా గిరోనా జన్తా నై అంటూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కోసం హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కి రెడీ అవడము… పట్టాలెక్కించడం జరిగింది. టాలీవుడ్ హీరోలే కాస్త కంగారు పడుతున్నారు. కరోనా సోకితే ప్రమాదం అనుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా రాధాకృష్ణ రాధేశ్యాం కోసం రెడీ అవుతున్నాడని టాక్ ఉండగా.. బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాని నవంబర్ నుండి మొదలవుతుంది అని అంటున్నారు. నవంబర్ నుండి మొదలు కాబోయే షెడ్యూల్ లో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమా షూటింగ్ చాలావరకు అడవుల్లోని తియ్యాల్సి ఉంది. అందుకే సుకుమార్ ఫస్ట్ షెడ్యూల్ నుండే అడవుల్లోకి వెళ్లాలని టీం ని ప్రిపేర్ చేస్తున్నాడట. ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇప్పటికే దేవిశ్రీ పుష్ప సినిమాకి కావాల్సిన ట్యూన్స్ ని కూల్ గా రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే మంచి ఐటెం ట్యూన్స్ ని రెడీ చేసాడట దేవి. ఇక ఐటెం పాప కోసం సుక్కు బాలీవుడ్ నే అప్రోచ్ కాబోతున్నాడట. రష్మిక మందన్న హీరోయిన్ గా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పుష్ప గెటప్ లోనే తిరుగుతున్నాడు. అంటే నవంబర్ వరకు బన్నీ పుష్ప లుక్ నే కంటిన్యూ చేస్తాడన్నమాట.
- Tags
- Pushpa