Fri Jan 10 2025 07:26:57 GMT+0000 (Coordinated Universal Time)
మొదలైన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్స్ వీళ్లే
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలైంది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - స్టైలిష్ స్టార్ అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య - 2 సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమా చాలా స్పెషల్. సుకుమార్ క్రియేటివిటీకి - బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే.. ఆ రచ్చ ఎలా ఉంటుందో డిసెంబర్ 17న స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్, ముఖ్యంగా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేశాయి. ఊరమాస్ లుక్ లో అడవిలో పుష్ప రాజ్ చేసే హంగామాను ట్రైలర్ లో చూసి ఖుషీ అవుతున్న బన్నీ ఫ్యాన్స్.. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో అర్జున్ ఇంకెంత బాగా చేశాడో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈవెంట్ కు....
పుష్ప లో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. స్పెషల్ సాంగ్ లో సమంత డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలైంది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవితో పాటు.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ లు చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ లో బన్నీ, చిరు, ప్రభాస్ లు ఇచ్చే స్పీచ్ ల కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు
Next Story