Mon Dec 23 2024 02:10:10 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్లో సినిమాలు చేయడంపై స్పందించిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై బన్నీ స్పందించాడు.
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. స్టైలిష్ స్టార్ ఇమేజ్ ని సొంత చేసుకొని అక్కడి నుంచి ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ నేడు నేషనల్ అవార్డు విన్నర్ గా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). బన్నీకి ఇప్పటికే తెలుగుతో సమానంగా మలయాళంలో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప సినిమాతో నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక త్వరలోనే అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. 'అశ్వత్థామ' అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో బన్నీ నటించాలంటూ బాలీవుడ్ మేకర్స్ అడిగినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఓకే చెప్పలేదని.. నిర్మాత బన్నీ వాసు ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. కాగా నేషనల్ అవార్డు అందుకున్న తరువాత అల్లు అర్జున్ తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు.
ఈక్రమంలోనే బాలీవుడ్లో సినిమాలు చేయడంపై స్పందించాడు. "ఇప్పటికే భాషతో సంబంధం లేకుండా ఒక పరిశ్రమకి చెందిన వారు మరో పరిశ్రమ వారితో కలిసి పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో సినిమా రూపురేఖలు మరింత మారనున్నాయి. భవిష్యత్తులో నేను కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తాను. ప్రస్తుతం అయితే సందీప్ వంగ, త్రివిక్రమ్ తో సినిమాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటాయి" అంటూ వెల్లడించాడు.
మరి బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. పార్ట్ 1 కి బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ క్యాటగిరీలో నేషనల్ అవార్డు రావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో సుకుమార్ కూడా 'పుష్ప ది రైస్' (Pushpa The Rise) విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి పార్ట్ 2తో పుష్ప రాజ్ ఎటువంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
Next Story