Mon Dec 23 2024 03:05:01 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప టీమ్ కు షాక్.. బాయ్ కాట్ పుష్ప అంటూ ట్రెండింగ్
ఇంకా మార్నింగ్ షో కూడా పడకుండానే బన్నీ అభిమానుల నుంచి పుష్ప టీమ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
అఖండ సినిమా ఇచ్చిన జోష్ తో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది పుష్ప- ది రైజ్ సినిమా. ఇంకా మార్నింగ్ షో కూడా పడకుండానే బన్నీ అభిమానుల నుంచి పుష్ప టీమ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బాయ్ కాట్ పుష్ప పేరుతో ట్రెండింగ్ జరుగుతోంది. తమ భాషను అవమానించారంటూ కన్నడిగులు పుష్ప టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottPushpaInKarnataka అంటూ ట్రెండింగ్ చేశారు. మొత్తం ఏడు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాను.. కన్నడలోనూ డబ్ చేశారు. అయితే.. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. కర్ణాటకలో పుష్ప సినిమాను కన్నడ భాషలో కంటే.. తెలుగు భాషలోనే ఎక్కువగా రిలీజ్ అవుతోంది. దీంతో కన్నడ బన్నీ అభిమానులు నొచ్చుకున్నారు. బాయ్ కాట్ పుష్ప అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా....
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పడగా.. మార్నింగ్ షో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. బన్నీ ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సరికొత్త ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదే మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మరి పుష్ప హిట్టా ? ఫట్టా ? తెలియాలంటే మరికొద్దిసేపు ఆగాల్సిందే.
- Tags
- pushpa
- allu arjun
Next Story