Mon Dec 23 2024 04:40:13 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికన్నా ముందే ఓటీటీలోకి పుష్ప.. క్లారిటీ ఇచ్చిన సంస్థ
పుష్ప ఓటీటీలో విడుదల కాబోతోందంటూ రెండ్రోజుల నుంచి వార్తలొస్తున్న నేపథ్యంలో.. సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా పుష్ప - ది రైజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ.. బిగ్గెస్ట్ హిట్ సినిమా ఆఫ్ ది ఇయర్ (2021)గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో విడుదలైన పుష్ప.. సుమారు రూ.250 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. ఇంత బిగ్గెస్ట్ హిట్ అయిన పుష్ప సినిమా.. విడుదలై నెలరోజులైనా కాకుండానే ఓటీటీలో విడుదల కాబోతోంది.
పుష్ప ఓటీటీలో విడుదల కాబోతోందంటూ రెండ్రోజుల నుంచి వార్తలొస్తున్న నేపథ్యంలో.. సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ పుష్ప స్ట్రీమింగ్ పై స్పందించింది. జనవరి 7వ తేదీ నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుందంటూ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సంక్రాంతి కన్నా ముందే పుష్ప సినిమా ఓటీటీలో వస్తుండటం.. బన్నీ అభిమానులను తెగ ఖుషీ చేసేస్తోంది. జనవరి 7వతేదీ రాత్రి 8 గంటల నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
Also Read : ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు
Next Story