Mon Dec 23 2024 07:48:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమెజాన్ ప్రైమ్ లో "పుష్ప" పార్ట్ 1 రిలీజ్ !
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా "పుష్ప ది రైజ్". ఈ సినిమా
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా "పుష్ప ది రైజ్". ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన భారతీయ ప్రధాన భాషల్లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా విడుదలై నెలరోజులైనా కాకుండా ఓటీటీలో విడుదలకు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.
Also Read : మంచువారమ్మాయినీ వదలని కరోనా.. !
జనవరి 7వ తేదీ.. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి "పుష్ప ది రైజ్" సినిమా ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం హిల్స్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించాడు. అల్లు అర్జున్ కూడా మునుపెన్నడూ చూడని గెటప్, స్లాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. స్మగ్లింగ్, పుష్ప రాజ్ - శ్రీవల్లి ల ప్రేమ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
Next Story