రంప చోడవరం నుండి వారణాసికి పయనమవుతున్న పుష్ప!!
పుష్ప సినిమా షూటింగ్ ని రంప చోడవరం అడవుల్లో మొదలు పెట్టిన సుకుమార్ అండ్ అల్లు అర్జున్ లు.. అక్కడ అడవుల్లో షూటింగ్ చిత్రకరణ చేస్తున్నారు. కేరళ [more]
పుష్ప సినిమా షూటింగ్ ని రంప చోడవరం అడవుల్లో మొదలు పెట్టిన సుకుమార్ అండ్ అల్లు అర్జున్ లు.. అక్కడ అడవుల్లో షూటింగ్ చిత్రకరణ చేస్తున్నారు. కేరళ [more]
పుష్ప సినిమా షూటింగ్ ని రంప చోడవరం అడవుల్లో మొదలు పెట్టిన సుకుమార్ అండ్ అల్లు అర్జున్ లు.. అక్కడ అడవుల్లో షూటింగ్ చిత్రకరణ చేస్తున్నారు. కేరళ అడవులు, నల్లమల అడవులుపోయి చివరకి రంప చోడవరం అడవులకి పుష్ప షూటింగ్ మార్చాల్సి వచ్చింది. కరోనా కారణంగా పుష్ప ప్లానింగ్ అంత దెబ్బతింది. అయినప్పటికీ సుకుమార్ మళ్ళీ ప్లాన్ చేసుకుని పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రంప చోడవరం అడవుల్లో పుష్ప షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ అడవుల్లో ప్లాన్ చేసిన.. సెకండ్ షెడ్యూల్ ని వారణాసిలో ప్లాన్ చేసిందట పుష్ప టీం.
పుష్ప సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ 18 నుండి వారణాసిలో చిత్రీకరించడానికి మూవీ టీం ప్లాన్ చేసుకుందట. అయితే వారణాసి షెడ్యూల్ లోనే అల్లు అర్జున్ స్పషల్ సాంగ్ లో డాన్స్ చేయబోతున్నాడట. దాని కోసం ఇప్పటికే సుకుమార్ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెల్లని పట్టుకొచ్చాడు. భారీ పారితోషికముతో ఊర్వశి అల్లు అర్జున్ పక్కన మాస్ స్టెప్స్ వేయనుంది. ఆ వారణాసి షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ తో పాటుగా.. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రకరణ కూడా జరగబోతుందట. మరి అన్ని ప్లాన్ చేస్తున్న సుకూంర్ పుష్ప విలన్ విషయం తేల్చకుండా ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నాడు.
- Tags
- Pushpa Shooting