Mon Dec 23 2024 10:34:48 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ దెబ్బకి భారీ షేర్లు కోల్పోయిన పీవీఆర్ ఐనాక్స్..!
సలార్ దెబ్బకి పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ మార్కెట్ లో భారీగా షేర్లు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏమైంది..?
Salaar : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్దకి వచ్చిన ఈ చిత్రం.. ఆడియన్స్ ని మెప్పించి భారీ కలెక్షన్స్ ని నమోదు చేసే దిశగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే, ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సలార్ దెబ్బకి.. స్టాక్ మార్కెట్ లో భారీగా షేర్లు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏమైంది..? సలార్ వల్ల షేర్లు కోల్పవడం ఏంటి..?
ఈ వారం సలార్ తో పాటు షారుఖ్ ఖాన్ 'డంకీ' కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఇండియా వైపు.. పీవీఆర్ మల్టీప్లెక్స్ ల్లో సలార్ కి కనీస స్క్రీన్స్ కూడా ఇవ్వకుండా డంకీకే ఎక్కువ స్క్రీన్స్ ని కేటాయించారట. ఇక ఈ విషయం పై సీరియస్ అయిన సలార్ చిత్ర నిర్మాతలు.. నార్త్ లో కనీస స్క్రీన్స్ ఇవ్వకపోతే, సౌత్‌లోని ఏ పీవీఆర్ థియేటర్స్ లో సలార్ ని రిలీజ్ చేయమని చెప్పారట. ఈ వార్త మీడియా వర్గాల ద్వారా అభిమానులకు తెలియడంతో.. ఫ్యాన్స్ అంతా '#BoycottPVRInox' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు.
అంతేకాదు కొంతమంది సౌత్ అభిమానులు.. పీవీఆర్ థియేటర్స్ లో బుక్ చేసుకున్న టికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈ వ్యతిరేకత పీవీఆర్ ఐనాక్స్ షేర్ల పై చూపించిందని చెబుతున్నారు. సలార్ దెబ్బతో పీవీఆర్ ఐదు సెషన్లలో 4 శాతం పడిపోయాయి అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గాని, రెబల్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు.
ఇక సలార్ మొదటి రోజు వసూళ్లు విషయానికి వస్తే.. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. మొదటిరోజే దాదాపు 200 కోట్ల మార్క్ కి దగ్గరిలో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ కి టెన్షన్ మొదలైంది. ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ టాప్ గ్రాసర్స్ గా మొదటి మూడు స్థానాల్లో జవాన్, పఠాన్, యానిమల్ ఉన్నాయి. ఇప్పుడు సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే.. ఆ సినిమా సెట్ చేసిన రికార్డులను కొన్ని రోజులోనే అందుకునేలా ఉంది. జవాన్ 1100 కోట్లకు పైగా, పఠాన్ 1000 కోట్లకు పైగా, యానిమల్ 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. మరి సలార్ తో ప్రభాస్ ఏం చేస్తారో చూడాలి.
Next Story