రణబీర్ - అలియాల గురించి ఓ న్యూస్
ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ - అలియాభట్‌ల ప్రేమ గురించి టాపిక్స్ రన్ అవుతున్నాయి. అలియాభట్ ఓ బ్రాస్లెట్ గిఫ్ట్‌ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి తెగ మురిసిపోతోంది. అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా అలియాభట్ కి రణ్‌బీర్‌కపూర్ సిస్టర్ రిద్ధిమా.. ఓ బ్రాస్లెట్ని గిఫ్ట్‌గా పంపింది దాన్ని ఫోటో తీసి తన అభిమానులతో షేర్ చేస్తూ, తెగ నచ్చేసిందనే కామెంట్ పెట్టింది అలియా.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా రణ్‌బీర్ 'సంజూ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తన ప్రేమ గురించి ఓ విషయాన్ని రివీల్ చేశాడు. ఆ సందర్భంగా రణ్‌బీర్ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అలియాభట్ తో డేటింగ్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు..ఇప్పుడే ప్రేమ మొదలైంది..కాస్త టైం కావాలి అని టాపిక్ కట్ చేసాడు. అంతే కాదు.. అలియా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఆమె నటన గురించి చెప్పాలంటే కొత్త మాటలు కనిపెట్టాలి అని తన మనసులో మాట చెప్పాడు.
ఆ మాటలు చూస్తుంటే రణబీర్ కు అలియా అంటే ఎంతో ఇష్టమో అర్ధం అవుతుంది. గతంలో రణబీర్ వాళ్ల డాడీ ట్విట్టర్ లో అలియా ఫ్యామిలీ గురించి పొగడ్తలు కురిపించడంతో దాంతో త్వరలోనే రణబీర్‌కపూర్- అలియా ఒక్కటి కానున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.