Mon Dec 23 2024 15:01:26 GMT+0000 (Coordinated Universal Time)
సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..!
ఒకప్పటి స్టార్ యాక్ట్రెస్ 'రాధ' వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ 'కార్తీక నాయర్' సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు..
ఒకప్పటి స్టార్ యాక్ట్రెస్ 'రాధ' వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ 'కార్తీక నాయర్'. నాగచైతన్యతో పాటు 'జోష్' సినిమాలో నటించి ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ తరువాత తమిళంలో జీవా సరసన 'రంగం' సినిమాలో నటించి సూపర్ హిట్టుని అందుకుంది. కానీ ఆ తరువాత సరైన సక్సెస్ లేక ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది. దీంతో కనీసం ఒక పది సినిమాల్లో కూడా నటించకుండానే వెనక్కి వెళ్లిపోయింది.
ఆ మధ్య హిందీ టెలివిజన్ లో ఒక సీరియల్ కూడా నటించింది. అయితే 2017 తరువాత నుంచి యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి దుబాయ్ వెళ్లిపోయింది. అక్కడ తమ ఫామిలీస్ కి ఉన్న హోటల్స్ బిజినెస్ ని విస్తరించే బాధ్యత తీసుకుంది. నటిగా సక్సెస్ అవ్వకపోయినా బిజినెస్ ఉమెన్ గా బాగా సక్సెస్ అయ్యింది. చాలా కొద్దీ కాలంలోనే అక్కడ ఉన్న బిజినెస్ బాగా డెవలప్ చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను కూడా అందజేశారు.
కాగా కార్తీక ఇప్పుడు పెళ్లి జీవితాన్ని కూడా మొదలు పెట్టడానికి కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో కార్తీక ఒక వ్యక్తిని కౌగిలించుకొని కనిపిస్తుంది. ఇక ఆ పిక్ లో కార్తీక చేతికి ఉన్న ఉంగరం హైలైట్ గా కనిపిస్తుంది. దీంతో ఆమె సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుందా..? అనే సందేహం అందరిలో మొదలైంది. ఈక్రమంలోనే ఆమె పోస్టు కింద కామెంట్స్ చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నారు అభిమానులు.
అలాగే ఆ వ్యక్తి ఎవరు..? అనే ప్రశ్న కూడా మొదలైంది. రాధ, కార్తీక నుంచి ఒక క్లారిటీ వస్తుందని గాని ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాగా రాధకి 'తులసి' అనే మరో కూతురు కూడా ఉంది. ఆమె కూడా రెండు సినిమాల్లో నటించింది. మణిరత్నం 'కడలి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తులసి కూడా.. తన తల్లిలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.
Next Story