Mon Dec 23 2024 15:05:50 GMT+0000 (Coordinated Universal Time)
Karthika Nair : రాధ కుమార్తె కార్తీక పెళ్ళి ఫోటోలు చూశారా..
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక పెళ్ళి నిన్న ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి, జాకీ ష్రాఫ్, రాధిక, సుహాసిని, రేవతి..
Karthika Nair : సీనియర్ నటి రాధ వారసురాలిగా వెండితెరకు పరిచమైన హీరోయిన్ కార్తీక. అక్కినేని నాగచైతన్యతో పాటు 'జోష్' సినిమాలో నటించి తెరగేంట్రం చేశారు. అయితే రాధలా కార్తీక సినీ పరిశ్రమ తన ముద్ర వేయలేకపోయారు. కేవలం తొమ్మిది చిత్రాలకే కెరీర్ ని ముగించేసి యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేశారు. ఆ తరువాత బిజినెస్ ఉమెన్ గా భాద్యతలు చేపట్టారు. దుబాయ్ లో ఉన్న తమ కుటుంబ బిజినెస్ చూసుకుంటూ అందులో సూపర్ సక్సెస్ అయ్యారు.
నటిగా ఫెయిల్ అయినా బిజినెస్ ఉమెన్ గా మాత్రం ఏకంగా దుబాయ్ గవర్నమెంట్ తో శభాష్ అనిపించుకున్నారు. అక్కడ కొద్దికాలంలోనే తమ బిజినెస్లని పెద్ద స్థాయిలో విస్తరించిన కార్తీకని అరబ్ దేశస్థులు ప్రత్యేక గుర్తింపుతో గౌరవించారు. తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి జీవితాన్ని కూడా మొదలు పెట్టారు. రోహిత్ మీనన్ అనే వ్యక్తితో ఆదివారం నాడు ఏడడుగులు వేశారు. కేరళ త్రివేండ్రంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అలనాటి తారలు.. చిరంజీవి, జాకీ ష్రాఫ్, రాధిక, సుహాసిని, రేవతి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.
Next Story