Sun Dec 22 2024 19:57:45 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ ఫస్ట్ డే కలెక్షన్స్
అభిమాన హీరో సినిమా నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవ్వడంతో.. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 7000 లకు పైగా
హైదరాబాద్ : ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అభిమాన హీరో సినిమా నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవ్వడంతో.. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 7000 లకు పైగా స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమాకు.. తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా స్లో గా సాగే ప్రేమ కథ అని రివ్యూలు వచ్చినా.. తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది.
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు వసూలైనట్లు సమాచారం. ఓవర్సీస్ లోనూ రాధేశ్యామ్ హవా కొనసాగింది. అమెరికాలో ప్రీమియర్, తొలి రోజు కలెక్షన్లు కలిపి 1.4 మిలియన్ల డాలర్లు రాబట్టింది. కాగా.. బీ టౌన్ లో రాధేశ్యామ్ ఏ మేరకు వసూళ్లు రాబట్టిందో తెలియాల్సి ఉంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
Next Story