Sun Dec 22 2024 19:43:09 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ ప్లాట్ ఫామ్ కు రాధేశ్యామ్ ?
ఈ మధ్యకాలంలో థియేటర్లో విడుదలైన ఏ సినిమా అయినా నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే రాధేశ్యామ్ కోసం కూడా ఓటీటీ..
హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా తొలి మూడ్రోజుల్లో రూ.151 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాధేశ్యామ్ ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్ రేంజ్ కి తగ్గ సీన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ మధ్యకాలంలో థియేటర్లో విడుదలైన ఏ సినిమా అయినా నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే రాధేశ్యామ్ కోసం కూడా ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన రాధేశ్యామ్.. ఏప్రిల్ 11న ఓటీటీలో విడుదలవ్వచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. కానీ.. అంతకన్నా ముందే రాధేశ్యామ్ ఓటీటీలోకి రావచ్చని తెలుస్తోంది. రాధేశ్యామ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్.. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది కానుకగా సినిమాను వదలాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. చర్చలు ఫలిస్తే ఏప్రిల్ 2నే రాధేశ్యామ్ ఓటీటీలోకి రావడం ఖాయం.
Next Story