Mon Dec 23 2024 05:21:15 GMT+0000 (Coordinated Universal Time)
రాధే శ్యామ్ కూడా వాయిదా.. ట్వీట్ చేసిన యూవీ క్రియేషన్స్ !
రెండ్రోజుల క్రితం కూడా రాధేశ్యామ్ ను జనవరి 14వ తేదీన విడుదల చేయడం ఖాయమని ఖచ్చితంగా చెప్పిన మేకర్స్.. ఇప్పుడు వాయిదా వేయడంతో
కరోనా దెబ్బకు సినీ పరిశ్రమకు పెద్దకష్టాలే వస్తున్నాయి. కోవిడ్ ఉదృతి కాస్త తగ్గింది కదా అని.. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్లలో విడుదలవుతున్నాయి. 2022 సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలుండగా.. కోవిడ్ వ్యాప్తి, థియేటర్లు మూసివేత ఇతర కారణాలతో ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. దీంతో మెగా ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశచెందారు. రాధేశ్యామ్ అయినా జనవరి 14వ తేదీన విడుదలవుతోందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మేకర్స్ షాకిచ్చారు. రాధేశ్యామ్ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
రెండ్రోజుల క్రితం కూడా రాధేశ్యామ్ ను జనవరి 14వ తేదీన విడుదల చేయడం ఖాయమని ఖచ్చితంగా చెప్పిన మేకర్స్.. ఇప్పుడు వాయిదా వేయడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. కొత్తవేరియంట్ ఒమిక్రాన్ తో పాటు.. కోవిడ్ కూడా వ్యాప్తి చెందడంతో దేశంలో, ప్రపంచంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే రాధేశ్యామ్ ను వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణమూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్.. సినిమాపై మంచి హైప్ ను తీసుకొచ్చింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ సినిమా రాధేశ్యామ్.. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని యూవీ క్రియేషన్స్ పేర్కొంది.
News Summary - Radhe Shyam Release Postponed. UV Creations Officially Announced by Twitter
Next Story