Mon Dec 23 2024 05:25:46 GMT+0000 (Coordinated Universal Time)
అంచనాలు పెంచేసిన రాధేశ్యామ్ ట్రైలర్
'మనం ఆలోచిస్తామని భ్రమపడతాం. కానీ మన ఆలోచనలు కూడా ముందుగానే రాసిపెట్టుంటాయి' అని ప్రభాస్ డైలాగ్ తో
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ రాధేశ్యామ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ తో రాధేశ్యామ్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ట్రైలర్ ని అంత ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్స్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా, యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలున్నాయి. ఐదుభాషల్లో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ అయింది.
Also Read : "అశోకవనంలో అర్జున కల్యాణం" విడుదల వాయిదా
మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు రాధేశ్యామ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా బుధవారం రాధేశ్యామ్ నుంచి సెకండ్ ట్రైలర్ ను విడుదల చేసింది. 'మనం ఆలోచిస్తామని భ్రమపడతాం. కానీ మన ఆలోచనలు కూడా ముందుగానే రాసిపెట్టుంటాయి' అని ప్రభాస్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత జగపతిబాబు- ప్రభాస్ ల మధ్య వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ట్రైలర్ చివరిలో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అని పూజ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 1970-80ల కాలం నాటి లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్.. ప్రేమకు - విధికి మధ్య జరిగే యుద్ధంగా చూపనున్నారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ బాణీలు సమకూరుస్తుండగా ఎస్.ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Next Story