Mon Dec 23 2024 08:23:50 GMT+0000 (Coordinated Universal Time)
డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రాధేశ్యామ్ విడుదల కూడా వాయిదా?
రాధేశ్యామ్ మూవీ విడుదల కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
పాన్ ఇండియా మూవీ లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడుతున్నట్లే కన్పిస్తుంది. రాధేశ్యామ్ మూవీ విడుదల కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాథేశ్యామ్ ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే RRR సినిమా విడుదల కూడా ఇప్పటికే వాయిదా పడింది. అయితే రాధేశ్యామ్ మేకర్స్ తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఒమిక్రాన్ ఎఫెక్ట్....
రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలు కావడంతోనే విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ రెండు సినిమాలకు భారీ బడ్జెట్ ను పెట్టి నిర్మించారు. అయితే దేశంలో ఒమిక్రాన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను విధించారు. ఢిల్లీలో సినిమాహాళ్లను మూసివేశారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో సినిమా థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీకే అనుమతివ్వడంతో వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిసింది.
Next Story