Mon Dec 23 2024 17:40:33 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ నుంచి "సంచారి" సాంగ్ రిలీజ్
రాధేశ్యామ్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తాజాగా రాధేశ్యామ్ నుంచి "సంచారి" పాటను విడుదల చేశారు మేకర్స్.
రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో భాషలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ రూపొందిస్తున్నారు. కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా.. రాధేశ్యామ్ పాటలన్నీ శ్రోతలను అలరిస్తాయని చెప్తోంది చిత్ర బృందం. తాజాగా రాధేశ్యామ్ నుంచి "సంచారి" పాటను విడుదల చేశారు మేకర్స్. ఛల్ ఛల్ ఛలో సంచారీ ఛల్ ఛలో.. అంటూ సాగే ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తూ.. లవర్ బాయ్ గా కనిపించాడు రెబల్ స్టార్.
2022 సంక్రాంతికి....
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకూ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డె తప్ప ఇతర ప్రధాన పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారన్నది చెప్పలేదు మేకర్స్. ఇప్పుడిప్పుడే పాటలను విడుదల చేస్తూ.. ప్రమోషన్స్ మొదలు పెట్టిన రాధేశ్యామ్.. 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా థియేటర్ విడుదలకు సిద్ధమవుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ప్రేమకావ్యం కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.
Next Story