Mon Dec 23 2024 05:46:07 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య హీరోయిన్
రాధికా ఆప్టే.. అటు ఉత్తరాదిన, ఇటు దక్షిణాదిన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక ఓటీటీలో కూడా తనకంటూ గుర్తింపును తెచ్చే పాత్రలను చేస్తూ వెళుతోంది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లలో సత్తా చాటుతున్న రాధిక.. ఇంటర్వ్యూలలో తన లైఫ్ లో జరిగిన విషయాలనే కాకుండా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటుంది. తాజాగా 'మోనికా ఓ మై డార్లింగ్' సినిమాలో నటించింది రాధికా ఆప్టే. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. పోలీసు ఆఫీసర్ పాత్రలో రాధిక ఆప్టే నటించింది.
ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్లకు ఆఫర్లు రావడం అనేది వయసుపై ఆధారపడి ఉంటుందని.. చాలామంది ప్రొడ్యూసర్లు యంగ్ హీరోయిన్లనే తమ సినిమాల్లోకి తీసుకోవాలని అనుకుంటారని.. అందుకే కమర్షియల్ సినిమాల్లో వాళ్లకే ఎక్కువ ఆఫర్లు వస్తాయని తెలిపింది. హీరోయిన్లకు కావాల్సిన లక్షణాలు మీలో లేవనే కామెంట్స్ ఇండస్ట్రీలో తరచుగా వినబడుతుంటాయని.. టాలెంట్ను బట్టి కాకుండా గ్లామర్ను బట్టి ఆఫర్లు ఇవ్వడం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉందని చెప్పుకొచ్చింది. అందుకే ఆఫర్స్ కోసం చాలామంది సర్జరీలు చేయించుకుంటున్నారని తాను మాత్రం ఎప్పుడూ సర్జరీలను నమ్ముకోలేదని తెలిపింది. అవకాశాల కోసం ఏనాడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపింది.
Next Story