అందులో నుండి బయటికి రావా.. రాఘవా..!
రాఘవ లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్. చిరంజీవి లాంటి వారికీ డాన్స్ మాస్టర్ గా పనిచేసిన రాఘవ అందరు డాన్స్ మాస్టర్స్ లానే మెగా ఫోన్ పట్టాడు. రెబల్, [more]
రాఘవ లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్. చిరంజీవి లాంటి వారికీ డాన్స్ మాస్టర్ గా పనిచేసిన రాఘవ అందరు డాన్స్ మాస్టర్స్ లానే మెగా ఫోన్ పట్టాడు. రెబల్, [more]
రాఘవ లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్. చిరంజీవి లాంటి వారికీ డాన్స్ మాస్టర్ గా పనిచేసిన రాఘవ అందరు డాన్స్ మాస్టర్స్ లానే మెగా ఫోన్ పట్టాడు. రెబల్, స్టైల్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ కి ఆ చిత్రాలు గొప్ప పేరైతే తీసుకురాలేకపోయాయి. అందుకే హర్రర్ కామెడీని నమ్ముకున్న లారెన్స్ ముని సీక్వెల్ కి తెర లేపాడు. ఏదో ఒకటి రెండు సినిమాలను హర్రర్ థిల్లర్ గా భయపెడితే ప్రేక్షకులు మెచ్చుతారు. ఏకంగా ఒకే స్టోరి మీద వరుసగా నాలుగు సినిమాలంటే అది చివరికి రొటీన్ గానే మారిపోతుంది.
అన్నీ రోటీన్ సినిమాలే…
తాజాగా మాస్ ని టార్గెట్ చేసి కాంచనకి సీక్వెల్ గా కాంచన 3 తెరకెక్కించాడు రాఘవ లారెన్స్. కాంచన, గంగ సినిమాల్లో చూసిన సీన్స్ అన్ని కాంచన 3లో కనబడడం… రొటీన్ గా కాంచన 3 ప్రేక్షకులను ఆకట్టుకోక పోగా అసలు అక్కడక్కడ కూడా ప్రేక్షకుడు హర్రర్ కామెడీని ఎంజాయ్ చెయ్యలేకపోయాడు. మరి ముని, కాంచన, గంగ, కాంచన 3 తీసి ప్రేక్షకుల మీదకి వదిలిన రాఘవకి కమర్షియల్ చిత్రాలు చెయ్యాలంటే భయమా? లేదంటే అవి వర్కౌట్ అవ్వవు హర్రర్ మూవీస్ తోనే బండి లాగించేద్దామనుకుంటున్నాడా? లేదంటే మళ్లీ కాంచన 3కి సీక్వెల్ అంటూ చివరిలో ఆ ఎండ్ కార్డు ఏమిటి. అసలు రాఘవ ఆ దెయ్యాల కథల నుండి బయటికి రావా అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.