Fri Nov 22 2024 19:15:59 GMT+0000 (Coordinated Universal Time)
RRRకు మరో గౌరవం.. ఆస్కార్ వేదికపై రాహుల్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మెన్స్
ఇప్పుడు ఈ పాటనే ఆస్కార్ వేదికపై లైవ్ లో పాడేందుకు వారిద్దరూ రెడీ అవుతున్నారు. కాలభైరవ్ కీరవాణి కొడుకే అయినప్పటికీ..
RRRకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈసారి ఆస్కార్ వేదికపై తెలుగు పాటను లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు "నాటు నాటు" పాట సింగర్స్. ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నిలబడిన RRRకు దక్కిన గౌరవమిది. తెలుగు ప్రేక్షకులు గర్వించదగిన క్షణం. జనాలను ఉర్రూతలూగించిన RRR నాటు నాటు పాటను కీరవాణి స్వరపరచగా.. కీరవాణి కొడుకు కాలభైరవ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లు ఈ పాటను ఆలపించారు.
ఇప్పుడు ఈ పాటనే ఆస్కార్ వేదికపై లైవ్ లో పాడేందుకు వారిద్దరూ రెడీ అవుతున్నారు. కాలభైరవ్ కీరవాణి కొడుకే అయినప్పటికీ.. అతని వాయిస్ తో ఫేమస్ అయ్యాడు. అలాగే రాహుల్ సిప్లిగంజ్.. బార్బర్ షాప్ ఫ్యామిలీ నుండి సింగర్ గా ఎదిగిన నేపథ్యం ఉంది. స్కూల్లో చదువుకున్న రోజుల్లో రాహుల్ కి సంగీతం పట్ల ఉన్న మక్కువని చూసి తండ్రి..ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీత సాధన కోసం జాయిన్ చేశాడు. ఆయనవద్ద సంగీతం నేర్చుకుని, ఏడేళ్లపాటు ఆయనవద్దే పనిచేశాడు.
తెలిసిన వాళ్లద్వారా డబ్బింగ్ సినిమాలకు కోరస్ పడే అవకాశాలు అందుకున్నాడు. అలా తొలిసారి నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కాలేజీ బుల్లోడా ఫుల్ సాంగ్ పడే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ సినిమాలకూ తన గళం అందించాడు రాహుల్. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. రాప్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టాడు. మగజాతి, ఎమ్ మాయలో, మంగమ్మ, మాకికిరికిరి, పూర్ బాయ్, దావత్, గల్లీ కా గణేష్, దూరమే, జై బజరంగ్, హిజ్రా వంటి రాప్ సాంగ్స్ చేసి హిట్ కొట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
రంగస్థలంలో ‘రంగ రంగ రంగస్థలాన’ అనే సాంగ్ పాడి స్టార్ సింగర్ గా ఎదిగాడు. RRR లో నాటు నాటు సాంగ్ తో పాన్ ఇండియా స్థాయిలో రాహుల్ కి క్రేజ్ ఏర్పడింది. మార్చి 12న అమెరికాలో జరగబోయే ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో ఆస్కార్ వేదికపై ఈ ఇద్దరు సింగర్లు నాటు నాటు పాటను లైవ్ లో పాడనున్నారు.
Next Story