Fri Dec 20 2024 17:33:59 GMT+0000 (Coordinated Universal Time)
Dravid - Charan : చాముండేశ్వరి ఆలయంలో రాహుల్ ద్రావిడ్, రామ్ చరణ్..
మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించుకున్న భారత్ క్రికెట్ టీం కోచ్ రాహుల్ ద్రావిడ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
Rahul Dravid - Ram Charan : భారత్ క్రికెట్ టీం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కర్ణాటక మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించుకున్నారు. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారిద్దరూ ఒకేసారి ఆ ఆలయాన్ని ఎందుకు సందర్శించారు..?
రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇటీవల మైసూర్ లో మొదలైంది. అక్కడ రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను శంకర్ తెరకెక్కించారు. ఆదివారంతో మైసూర్ షెడ్యూల్ పూర్తి అవుతుందని నిర్మాత దిల్ రాజు ఇటీవల తెలియజేశారు. ఇక నిన్న ఆదివారంతో ఆ షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందుకున్నారు.
ఇక ద్రావిడ్ విషయానికి వస్తే.. తన కుమారుడి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మైసూర్ వచ్చారు. అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ టోర్నమెంట్ మైసూరులో జరుగుతుంది. కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్టుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కి మానసంగోత్రిలోని శ్రీకాంత్ దత్తా నరసింహరాజ వడయార్ స్టేడియం వేదిక అయ్యింది. ఇక ఈ టోర్నమెంట్ ద్రావిడ్ కుమారుడు ఆడుతుండడంతో.. ద్రావిడ్ దంపతులు మైసూర్ వచ్చారు. ఈక్రమంలోనే చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు.
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ పూర్తిగా అయ్యిందని నిర్మాత దిల్ రాజు తెలియజేశారు. కానీ మిగితా బ్యాలన్స్ ఎప్పుడు పూర్తి అవుతుందనేది మాత్రం తెలియజేయలేదు. జనవరి, ఫిబ్రవరి లోపు షూటింగ్ పూర్తి అవ్వొచ్చని, పోస్ట్ ప్రొడక్షన్స్కే చాలా సమయం తీసుకోబోతున్నారని ఫైలిన్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. 2024 దసరాకి ఈ మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story