రాహుల్ ఈసారి నాగ చైతన్యతోనేనా?
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఏ నోట విన్నా ఆయన తీసిన 'చి.ల.సౌ' గురించే. సెన్సిబుల్ కథని అదే తరహాలో డీల్ చేసి ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచారు. ఈ సినిమాలో కంటెంట్‌ని చూసే నాగార్జున తన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. అంతే కాదు తదుపరి సినిమాని నాకే చేయాలని రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు కూడా. దాంతో రాహుల్‌కి తొలి సినిమా సక్సెస్‌తో పాటు రెండో ఆఫర్ కూడా చేతికొచ్చినట్టయింది. సహజంగానే టాలెంట్ ఉందనిపిస్తే అస్సలు వదిలిపెట్టడు నాగార్జున. ఆయన నమ్మకమే నిజమైంది. 'చి.ల.సౌ' మొదట మల్టీప్లెక్స్సినిమా మాత్రమే అవుతుందేమో అనుకొంటే, బీసీ సెంటర్లలో కూడా ఆ సినిమా అదరగొడుతోంది. ఇక రాహుల్ చేసే తదుపరి సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈసారి రాహుల్ ఎవరితో సినిమా చేయొచ్చు? ఎలాంటి సినిమా చేయొచ్చనే విషయాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
కుదిరితే అన్నతో లేదా తమ్ముడితో
విశ్వసనీయ సమాచారం మేరకు అది అక్కినేని యువ కథానాయకులైన నాగచైతన్య లేదంటే అఖిల్‌లో ఎవరితోనైనా ఒకరితో ఉండే అవకాశాలున్నట్టు తెలిసింది. సుశాంత్‌కి 'చి.ల.సౌ' కథ చెప్పకముందు, ఓ యాక్షన్ కథని వినిపించాడట. అయితే తనకి సున్నితమైన కథే చేయాలని ఉందని చెప్పడంతో అప్పుడు చి.ల.సౌ చెప్పాడట. అయితే తొలి చిత్రం కోసమని తానెంతగానో ప్రేమించి రాసుకొన్న యాక్షన్ కథనే తదుపరి అక్కినేని హీరోల్లో ఎవరితో ఒకరితో చేయాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నాడట. నాగార్జున అడ్వాన్సయితే ఇచ్చాడు కానీ.. ఇంకా రాహుల్ నుంచి కథ వినలేదు. ఆయన చెప్పే కథని బట్టే నాగ్ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. మంచి కథ అనిపిస్తే తన ఇంట్లోనే కావాల్సినంత మంది కథానాయకులు ఉన్నారు కాబట్టి నాగ్ అస్సలు వదిలిపెట్టరు. సో... ఆల్మోస్ట్ అక్కినేని కథానాయకులతోనే రాహుల్ తదుపరి సినిమా ఉంటుందనేది ఓ అంచనా.