Sun Dec 22 2024 22:33:06 GMT+0000 (Coordinated Universal Time)
"పుష్ప" మూవీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి. మొత్తం పదిహేను చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థకు చెందిన కార్యాలయాలు, నిర్మాత ఇళ్లపై కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుపుతుంది.
రెండు సూపర్ హిట్ మూవీస్...
పుష్ప, సర్కార్ వారి పాట చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాల్లో లభించిన ఆదాయానికి సంబంధించిన లెక్కలు సరిగా చూపలేదని అనుమానించిన ఐటీశాఖ ఈ దాడులను నిర్వహిస్తున్నారని తెలిసింది.
Next Story