Mon Dec 23 2024 14:30:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏ1గా రాజ్ తరుణ్.. ఏ2గా హీరోయిన్ మాల్వీ
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేసింది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని.. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని తెలిపింది. 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. తనను రాజ్ తరుణ్, మాల్వీ డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. తాను 45 రోజుల పాలు జైల్లో ఉన్నానని వాపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ బెదిరించారని లావణ్య పోలీసులకు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు కావాలని.. అతన్ని వదులుకోనని లావణ్య చెబుతోంది. మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని.. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళతానని లావణ్య తేల్చి చెప్పింది.
Next Story