రాజ్ తరుణ్ చేయబోయేది ఆ తరహా చిత్రమా..?
దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి ‘ఉయ్యాల జంపాల’లతో హీరో అయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్’లతో హిట్స్ కొట్టాడు. ‘ఈడో [more]
దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి ‘ఉయ్యాల జంపాల’లతో హీరో అయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్’లతో హిట్స్ కొట్టాడు. ‘ఈడో [more]
దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి ‘ఉయ్యాల జంపాల’లతో హీరో అయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్’లతో హిట్స్ కొట్టాడు. ‘ఈడో రకం.. ఆడో రకం’తో ఫర్వాలేదనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన డౌన్‌ఫాల్ మొదలైంది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్’ వంటి చిత్రాలలో నటించాడు. అన్నపూర్ణ బేనర్‌తో పాటు దిల్ రాజు కూడా ఈయనకు హిట్ ఇవ్వలేకపోయాడు. తాజాగా ఆయన దిల్ రాజు దర్శకత్వంలో మరో చిత్రం ఒప్పుకున్నాడు. ఒకవిధంగా ఈ కొత్త చిత్రం రాజ్ తరుణ్ కెరీర్‌కి చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఈసారి ఏడాది పాటు భారీ గ్యాప్ తీసుకుని ఆయన ఓ చిత్రం చేస్తున్నాడు. నితిన్ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్ర దర్శకుడు విజయ్‌కుమార్ కొండా దీనికి దర్శకుడు. విజయ్‌కుమార్ కూడా నితిన్‌తో మొదటి చిత్రం హిట్ ఇచ్చినా నాగచైతన్య, పూజ హెగ్డేలతో తీసిన ‘ఒక లైలా కోసం’ చిత్రం ఫ్లాప్ అయింది. దీంతో ఈయన కూడా భారీ గ్యాప్ తరువాత దిల్ రాజు బేనర్లో రాజ్‌తరుణ్‌తో ఓ చిత్రం చేయనుండటం విశేషం.
పెద్ద వయస్సు అమ్మాయిని ప్రేమించే హీరో
మధ్యలో విజయ్‌కుమార్ కొండా కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ చిత్రం ద్వారా గాడిలో పడాలని చూస్తున్నాడు. ఇక ఈ మూవీకి ‘ఇద్దరిలోకం ఒకటే’ అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మెయిన్ పాయింట్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తనకంటే వయసులో పెద్దదయిన అమ్మాయి ప్రేమలో తక్కువ వయసు ఉన్న హీరో ప్రేమలో పడటం అనేది మెయిన్ పాయింట్‌గా తీసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ నుంచి ఎందరో తమకంటే వయసులో పెద్ద ఉన్న వారిని వివాహం చేసుకున్నాడు. ఇక అప్పుడెప్పుడో వీరూ.కె. దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆరోప్రాణం’ కూడా ఇదే పాయింట్‌తో రూపొందింది. ఇందులో వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్గా సౌందర్య, వయసులో చిన్నవాడైన హీరోగా వినీత్ నటించారు. ఇక రాజ్ తరుణ్ చిత్రంలో ఆయన కంటే కాస్త పెద్ద వయసు హీరోయిన్గా నిత్య మీనన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.