Mon Dec 23 2024 15:08:26 GMT+0000 (Coordinated Universal Time)
"అన్స్టాపబుల్" ఫన్ అండ్ ప్రమోషన్స్ తో వస్తోన్న జక్కన్న
రాజమౌళి, కీరవాణి బాలయ్యతో కలిసి "అన్స్టాపబుల్" షో లో ఫన్ అండ్ ప్రమోషన్స్ జరపనున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా "ఆహా" నిర్వహిస్తున్న షో "అన్స్టాపబుల్." పేరుకు తగ్గట్టే అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది ఈ షో. గత శుక్రవారం ఈ షోలో బాలకృష్ణ అఖండ టీమ్ తో కలిసి ప్రేక్షకులకు అన్ స్టాపబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించారు. తాజాగా.. ఆహా రిలీజ్ చేసిన ఫొటోలను చూస్తుంటే త్వరలోనే ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని తెలుస్తోంది. దర్శకదిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలతో బాలయ్య చేసిన సందడి ప్రేక్షకులకు ఖచ్చితంగా అలరిస్తుంది. రాజమౌళి, కీరవాణి బాలయ్యతో కలిసి "అన్స్టాపబుల్" షో లో ఫన్ అండ్ ప్రమోషన్స్ జరపనున్నారు.
బిగ్గెస్ట్ ట్రీట్...
అయితే.. ఈ ఎపిసోడ్ 5వ ఎపిసోడ్ గా వస్తుందా లేక 6వ ఎపిసోడ్ గా ప్రసారమవుతుందా అన్నదానిపై ఆహా సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. గతవారం మహేష్ బాబు కూడా బాలయ్య షోలో పాల్గొన్న ఫోటోలను నెటిజన్లతో పంచుకోగా.. మహేష్ ఎపిసోడ్ తర్వాతే రాజమౌళి, కీరవాణిల ఎపిసోడ్ ప్రసారమవ్వనున్నట్లు సమాచారం. ఈ షో తో జక్కన్న, కీరవాణిలు ఎంటర్టైన్ మెంట్ కి ఎంటర్టైన్ మెంట్.. మరో పక్క ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. జనవరి 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కి విశేష స్పందన రాగా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ మీడియాతో టీమ్ ఇంటరాక్ట్ అయ్యింది.
Next Story