Mon Dec 23 2024 11:05:20 GMT+0000 (Coordinated Universal Time)
బాహుబలి పార్ట్ 3 వస్తుంది : రాజమౌళి
ఇటీవల రాజమౌళి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 3 గురించి అడగ్గా..
హైదరాబాద్ : బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆ సినిమాలతో రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడిగా.. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. ఈ రెండు సినిమాల తర్వాత బాహుబలి 3 కూడా వస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. దీనికోసం ప్రేభకులు, ప్రభాస్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ దర్శకుడు రాజమౌళి.. బాహుబలి 3 పై సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల రాజమౌళి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 3 గురించి అడగ్గా.. పార్ట్ 3 తప్పకుండా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తామని చెప్పారు. మూడో పార్ట్ కు సంబంధించి వర్క్ చేస్తున్నామని తెలిపారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే సినిమా రావడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు.
Next Story