Mon Dec 23 2024 18:44:12 GMT+0000 (Coordinated Universal Time)
హాలీవుడ్ కి రాజమౌళి.. బియాండ్ ఫెస్ట్ లో సినిమాల ప్రదర్శన
ఇప్పుడు రాజమౌళి వల్లే.. తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతోంది. యూఎస్ లో జరిగే ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్..
బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళికి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇటీవల వచ్చిన RRR సినిమాతో రాజమౌళి ప్రపంచంలోనే గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరొందారు. టాలీవుడ్ నుంచి.. హాలీవుడ్ వరకూ అన్ని సినిమా పరిశ్రమలకు చెందిన టెక్నీషియన్స్, ప్రేక్షకులు RRRపై ప్రశంసల వర్షం కురిపిచారు. అంతేకాదు.. RRRకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్.. తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
ఇప్పుడు రాజమౌళి వల్లే.. తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతోంది. యూఎస్ లో జరిగే ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ లో జరిగే పెద్ద సినీ ఫెస్ట్ లలో ఒకటైన ఈ బియాండ్ ఫెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకూ జరగనుంది. ఈ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు. ఈ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫెస్ట్ నిర్వాహకులు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజమౌళి అనే పేరులో ఆయన సినిమాల పోస్టర్స్ వచ్చేలా డిజైన్ చేసి టాలీవుడ్ టు హాలీవుడ్ అని రాశారు. ఈ విషయంపై ఫెస్ట్ నిర్వాహకులు స్పెషల్ గా ట్వీట్ చేయడం విశేషం.
బియాండ్ ఫెస్ట్ లో సెప్టెంబర్ 30న "RRR" సినిమా, అక్టోబర్ 1న "ఈగ", "బాహుబలి పార్ట్ 1&2", అక్టోబర్ 21న "మగధీర", 23న "మర్యాద రామన్న" సినిమాలు ప్రదర్శించనున్నారు. కాగా.. రాజమౌళి కూడా ఈ ఫెస్ట్ కి అతిథిగా వెళ్తారని సమాచారం. తెలుగు సినిమాలను హాలీవుడ్ వరకూ తీసుకెళ్లిన ఘనత ఒక్క రాజమౌళికే చెందుతుందనడంలో అతిశయోక్తి లేదు.
Next Story