Mon Dec 23 2024 19:00:05 GMT+0000 (Coordinated Universal Time)
RRRలో ప్రతీ సీన్ హైలెట్.. ఆ సీన్ చూస్తే విస్మయం చెందాల్సిందేనట !
ఇంకొక్కరోజులో సినిమా విడుదల కానుండగా.. రాజమౌళి సినిమాపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకుడిని..
హైదరాబాద్ : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. బాహుబలి సిరీస్ తో సౌత్ ఇండియా సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు RRRతో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు. RRR విడుదలకు ఇంకొక్కరోజే సమయం. తారక్ - చరణ్ లు కీలక పాత్రలు పోషించిన RRR మార్చి 25న విడుదల కాబోతోంది. యావత్ దేశం కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే RRRపై సెన్సార్ రివ్యూ వచ్చేసింది. RRR తో రాజమౌళి పేరును సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇంకొక్కరోజులో సినిమా విడుదల కానుండగా.. రాజమౌళి సినిమాపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ట్రైన్ బ్లాస్ట్ సీన్ అందరినీ విస్మయానికి గురిచేయడం ఖాయమంటున్నారు. "ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ ఉంటుంది. మినియేచర్ సెట్ వేసి .. సీజీలో కంపార్ట్ మెంట్ ను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఇది తెరపై చాలా సహజంగా .. భారీగా కనిపిస్తుంది. ఈ సీన్ చూస్తూ అంతా కూడా విస్మయానికి లోనవుతారు.
ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే, దీనిని ఎలా తీశారబ్బా? అనే ఆలోచన చేస్తూనే ఉంటారు. అంతగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. అడుగడున ఎదురయ్యే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ ఫీల్ ను పదే పదే పొందడానికి మళ్లీ మళ్లీ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు" అని రాజమౌళి చెప్పుకొచ్చారు. చూద్దాం మరి.. ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో రికార్డులను సృష్టిస్తుందో.
Next Story