రాజమౌళి ఆ సినిమా కోసం ఏం చేస్తున్నారంటే..?
'బాహుబలి' సిరీస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని.. సస్పెన్సుకు తెరదించుతూ పోయిన ఏడాది రాజమౌళి తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు ప్రకటించాడు జక్కన్న. ఈ సినిమాకు ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఇప్పటివరకు పేపర్ వర్క్ మీదే ఉన్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలకమైన టీం నేరుగా ఫీల్డ్ లోకి దిగేసినట్లు సమాచారం. 'బాహుబలి' సిరీస్ కు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాబు సిరిలే ఈ సినిమాకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఆయన సమక్షంలో హైదరాబాద్ పరిసరాల్లో ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయట. అందుకు నిర్మాత డీవీవీ దానయ్య ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత స్థలాన్ని రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నారట.
వచ్చే ఏడాదే...
అక్కడ కొన్ని యాక్షన్స్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు టీం. డైరెక్టర్ రాజమౌళి కూడా వెళ్లి పనుల్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్టోరీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నా, అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ ఏడాది లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది స్టార్టింగ్ లో షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం తారక్.. చరణ్ లు వారి సినిమాల్లో బిజీగా ఉండటం వలన వాళ్లు ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.