Mon Dec 23 2024 00:36:51 GMT+0000 (Coordinated Universal Time)
రాజమౌళి నెక్స్ట్ మూవీ 'SSMB29' కాదు.. 'మేడ్ ఇన్ ఇండియా'..
రాజమౌళి నెక్స్ట్ మూవీ 'SSMB29' కాదట. తాజాగా 'మేడ్ ఇన్ ఇండియా' అంటూ ఒక కొత్త మూవీని అనౌన్స్ చేశాడు.
దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తీసుకు వచ్చాడు. ప్రస్తుతం ఆడియన్స్ అంతా రాజమౌళి నెక్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా..? అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే రాజమౌళి నెక్స్ట్ మూవీ 'SSMB29' కాదట. తాజాగా 'మేడ్ ఇన్ ఇండియా' అంటూ ఒక కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. ఇది ఒక బయోపిక్ గా తెరకెక్కబోతుంది.
ఇది ఏంటి కొత్తగా..? మరి మహేష్ బాబు సినిమా ఏమైందని కంగారు పడుతున్నారా..? ఆ టెన్షన్ ఏం వద్దు. ఎందుకంటే ఈ సినిమాకి రాజమౌళి డైరెక్టర్ కాదు. ఈ చిత్రానికి కేవలం ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. జక్కన్న పర్యవేక్షణలో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. ఈ మూవీకి రాజమౌళి కొడుకు SS కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఇంతకీ ఎవరి బయోపిక్ తెరకెక్కిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా..? సినిమా మీదే ఈ బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, భారతీయ సినిమాని ఎవరు మొదలు పెట్టారు, ఎవరెవరు పరిశ్రమ డెవలప్మెంట్ లో ముఖ్యపాత్ర పోషించారు అనే విషయాలను కథగా తీసుకోని ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు. అందుకనే ఈ మూవీకి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్ ని పెట్టారు.
ఇక ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి ప్రకటిస్తూ తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ కింద ఇలా రాసుకొచ్చాడు.. "ఈ కథ విన్నప్పుడు తను చాలా ఎమోషనల్ అయ్యాను. బయోపిక్ తెరకెక్కించడం చాలా కష్టం. అలాంటిది ఫాదర్ అఫ్ ఇండియన్ సినిమా గురించి చెప్పడం మరింత ఛాలెంజింగ్ ఉంటుంది. మా బాయ్స్ ఇప్పుడు దానికి రెడీగా ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story