ఈ లెక్కలు చూస్తే షేకే
రాజమౌళి.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలసి హాట్ ఫెవరెట్ గా 2021 సంక్రాతి బరికి #RRR ని సిద్ధం చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో [more]
రాజమౌళి.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలసి హాట్ ఫెవరెట్ గా 2021 సంక్రాతి బరికి #RRR ని సిద్ధం చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో [more]
రాజమౌళి.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలసి హాట్ ఫెవరెట్ గా 2021 సంక్రాతి బరికి #RRR ని సిద్ధం చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈసినిమా పై ట్రేడ్ లోనే కాదు… డిస్ట్రిబ్యూటర్స్ లోను భీబత్సమైనా అంచనాలున్నాయి. ఎన్ని సినిమాలు ఎదురెళ్ళినా #RRR సినిమాని కొట్టడం సాధ్యం కాదని వారు డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది వ్యవహారం. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RRR ప్రీ రిలీజ్ లెక్కలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అసలా లెక్కలు చూస్తే బాహుబలి ని కొట్టెయ్యడం కాదు… అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే నైజాంలో దిల్ రాజు 75 కోట్లకి #RRR హక్కులను దక్కించుకున్నాడనే న్యూస్ ఉంది.
తాజాగా ఈస్ట్ గోదావరి, సీడెడ్, వైజాగ్, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలు బయటికొచ్చేశాయి. మరి ఈ లెక్కలు చూస్తుంటే రాజమౌళి #RRR తో మాములుగా కొట్టేలా కనిపించడం లేదు. సౌత్ లోనే ఈ సినిమాతో 400 కోట్లకు కొల్లగొట్టేలా కనబడుతున్నాడు. మరి ఇంతవరకు జరిగిన #RRR ప్రీ రిలీజ్ లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏరియా: ప్రీ రిలీజ్ లెక్కలు(కోట్లలో)
నైజాం 75.00 కోట్లు
సీడెడ్ 40.00 కోట్లు
వైజాగ్ 30.00 కోట్లు
కర్ణాటక 50.00కోట్లు
ఓవర్సీస్ 75.00 కోట్ల
మరి ఇంకా కొన్ని ప్రాంతాలు హక్కులు అమ్మకుండానే దాదాపుగా ఇప్పుడు 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ఇంకా మిగతా ఏరియాలు , అలాగే డిజిటల్, శాటిలైట్, ముఖ్యంగా బాలీవుడ్ హక్కులు ఇలా ఎలా చూసిన #RRR 500 కోట్ల కి పైనే ఆదాయం నిర్మాతలకు తేవడం ఖాయంగా కనబడుతుంది.