రాజమౌళి మదిలో వేరే ఉందిలే
రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ ని అప్పుడే 80 నుండి 85 శాతం పూర్తి చేసేసాడు. సినిమా మొదలై కూడా ఏడాది [more]
రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ ని అప్పుడే 80 నుండి 85 శాతం పూర్తి చేసేసాడు. సినిమా మొదలై కూడా ఏడాది [more]
రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ ని అప్పుడే 80 నుండి 85 శాతం పూర్తి చేసేసాడు. సినిమా మొదలై కూడా ఏడాది గడిచిపోయింది. కానీ ఇంతవరకు రాజమౌళి #RRR టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదు. ఈ విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాజమౌళి టైటిల్ ఎనౌన్సమెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి గతంలో #RRR టైటిల్ మీద టైటిల్ కాంటెస్ట్ నిర్వహించి.. ఇప్పుడు మెదలకుండా ఊరుకుని తన షూటింగ్ తాను చేసుకుంటున్నాడు. అయితే #RRR టైటిల్ కాంటెస్ట్ అప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంత కలిసి ఎక్కువగా #RRR టైటిల్ గా రామ రావణ రాజ్యం అయితే బావుంటుంది అని.. ఆ టైటిల్ కే ఎక్కువ మంది ఓటేశారు. అయితే ఫ్యాన్స్ హంగామానే కానీ… రాజమౌళి మాత్రం టైటిల్ విషయం తేల్చలేదు.
అయితే తాజాగా రామ రావణ రాజ్యం టైటిల్ ని ఓ బుల్లి నిర్మాత డైరెక్టర్స్ కలిసి తమ సినిమాకి పెట్టేసుకున్నారు. V6 అనే నిర్మాణ సంస్థ తమ సినిమాకి ఈ టైటిల్ ని పెట్టుకోవడం తో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే రాజమౌళి ఆ చిన్న సినిమాకి పెట్టుకున్న టైటిల్ పై స్పందించకపోవడంతో.. అసలు రాజమౌళి మదిలో #RRR టైటిల్ వేరే ఉందిలే అందుకే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడని అంటున్నారు. అయితే రాజమౌళి కూడా #RRR టైటిల్ ని పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా పెట్టాలని, అందుకే అందరికి ఎక్కేలా ఓ టైటిల్ ని అనుకున్న, అది ఈ సంక్రాంతికి #RRR టైటిల్ ని రివీల్ చెయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎలాగూ సంక్రాంతికి #RRR హడావిడి పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి… రాజమౌళి ఈ సంక్రాంతికి #RRR టైటిల్ పై క్లారిటీ ఇవ్వొచ్చు.
- Tags
- rrr