Fri Dec 20 2024 12:01:32 GMT+0000 (Coordinated Universal Time)
Rajamouli - Prabhas : ఆ రికార్డులో రాజమౌళి, ప్రభాస్‌కు రెండు స్థానాలు..
ఆ రికార్డులో ప్రభాస్ అండ్ రాజమౌళి రెండు రెండు సినిమాలతో రెండు స్థానాలను సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు ఏంటి..?
Rajamouli - Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఫస్ట్ డేనే రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా.. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి 400 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది.
మొదటి వారం పూర్తి అయ్యేపాటికి సలార్ సినిమా.. రూ.560 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. ఈ ఏడాది ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్స్‌లో ఇదే టాప్. మరి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో ఏ సినిమా మొదటి స్థానంలో ఉంది..? ఈ ప్రశ్నకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ లెక్కలు చూడకుండానే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మొదటి స్థానంలో ఉందని చెప్పేయొచ్చు. ఇంతకీ బాహుబలి 2 మొదటి వారం కలెక్షన్స్ ఏంటంటే.. 840 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది.
ఈ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ చిత్రం మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి 640 కోట్లకు పైగా కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. దీని తరువాత స్థానంలో 560 కోట్లతో సలార్ నిలిచింది. ఇలా మొదటి వారం అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసిన రికార్డులో.. రాజమౌళివి రెండు సినిమాలు (బాహుబలి 2, ఆర్ఆర్ఆర్) ఉంటే, ప్రభాస్‌వి రెండు సినిమాలు (బాహుబలి 2, సలార్) ఉన్నాయి.
ఒకవేళ సలార్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే.. ఈ రికార్డులో కూడా రాజమౌళి, ప్రభాస్ రెండు రెండు సినిమాలతో నిలుస్తారు. మరి ప్రభాస్ సలార్‌తో వెయ్య కోట్ల క్లబ్ లోకి అడుగుపెడతాడు లేదా చూడాలి.
Next Story