Mon Dec 23 2024 00:30:40 GMT+0000 (Coordinated Universal Time)
SSMB29 : రాజమౌళి మూవీ కోసం.. మహేష్‌కి ఎనిమిది లుక్స్..
SSMB29 మూవీ కోసం రాజమౌళి.. మహేష్‌కి మొత్తం ఎనిమిది లుక్స్ డిజైన్ చేయించారట.
SSMB29 : ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి.. తదుపరి ప్రాజెక్ట్ 'SSMB29' కోసం టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ ఆడియన్స్ వరకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఆడియన్స్ లో మరో విషయం కూడా ఎంతో ఆసక్తిగా మారింది. అదేంటంటే.. మహేష్ బాబు తన కెరీర్ లో నటించిన అన్ని చిత్రాల్లో దాదాపు ఒకే లుక్ లో కనిపిస్తూ వచ్చారు.
మరి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడో అనేది తెలుగు ఆడియన్స్ లో ఎంతో ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన ఓ వార్తే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్.. లాంగ్ హెయిర్ అండ్ గుబురు గడ్డంతో కనిపించనున్నారట. ఇందుకోసం ఆ ఫీచర్స్ తో రాజమౌళి ఎనిమిది లుక్స్‌ని డిజైన్ చేయించినట్లు సమాచారం.
వాటిలో మహేష్‌కి సెట్ అయ్యే లుక్ ని ఎంపిక చేసి ఫైనల్ చేయనున్నారట. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ప్రస్తుతం జుట్టు, గడ్డం పెంచుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కి 'అవతార్' మూవీ దర్శకుడు 'జేమ్స్ కామెరాన్' అతిథిగా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story