Mon Dec 23 2024 00:22:16 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ తొలి టికెట్‌ని భారీ ధరకి కొన్న రాజమౌళి.. ఎంతో తెలుసా..?
సలార్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ తొలి టికెట్ ని భారీ ధరకి రాజమౌళి సొంతం చేసుకున్నారట.
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం దగ్గర పడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో ఆరు రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే మూవీ తొలి టికెట్ ని భారీ ధరకి రాజమౌళి సొంతం చేసుకున్నారట.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి హోస్టుగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వి రాజ్ సుకుమారన్ పాల్గొనున్నారట. ఇక ఈ ఇంటర్వ్యూలోనే రాజమౌళి సలార్ తొలి టికెట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. రాజమౌళి రూ.10,116 పెట్టి సలార్ తొలి టికెట్ ని సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.
ఆ ఇంటర్వ్యూ కోసం అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ని ఒక షోలో చూసి చాలా కాలం అవుతుంది. దీంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం.. ఇప్పటికే ఒక ట్రైలర్ అండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ రెండు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సృష్టిస్తున్నాయి. సినిమా రిలీజ్ లోపు మరో సాంగ్ అండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ ట్రైలర్ యాక్షన్ కట్ తో ఉండబోతుందట. మరి ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Next Story