ఆమిర్ ఏం చేయలేకపోయాడు..మరి రజనీ..?
'బాహుబలి' సినిమా తెలుగు ఇండస్ట్రీ అని ఒకటి ఉందని తెలిసేలా చేసింది. ఇటువంటి సినిమా మన నుండి బయటికి వచ్చినందుకు మనవాళ్లు చాలా ఆనందం పడ్డారు. కానీ కోలీవుడ్.. బాలీవుడ్ వారికి ఈ సినిమా చూసిన తరువాత అసూయ కలిగింది. బాలీవుడ్, కోలీవుడ్ లో రాజమౌళిని మించి సినిమాలు తీసే వాళ్లు ఉన్నా ఇప్పటివరకు తీయలేకపోయారు. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ లాంటి వారు 'బాహుబలి'ని ఇన్స్పైర్ అవ్వాలని సూచించారు. కోలీవుడ్ లో శంకర్ కూడా ఈ సినిమాను చూసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో దీనికి మించిన సినిమా తీయాలనుకున్నాడు. దీంతో అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ వారికి 'బాహుబలి' సిరీస్ ఒక ఛాలెంజ్ గా మారింది. అయితే ఈ ఏడాది ఈ రెండు ఇండస్ట్రీల నుంచి ‘బాహుబలి’ని బీట్ చేసే సత్తా ఉన్న చిత్రాలుగా రెండు లైన్లోకి వచ్చాయి. అవే 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', '2.o'.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తేలిపోయింది...
ఇందులో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోస్ ని పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఆమిర్ మీద నమ్మకంతో ఈ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలుకొడుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమిర్ ఖాన్ కి ఉన్న మార్కెట్ అటువంటిది. అయితే ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో 'బాహుబలి' రికార్డ్స్ సేఫ్ గా ఉన్నాయి.
బాహుబలిని బీట్ చేస్తుందా..?
ఇక రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘2.o’ కోసం ఎదురు చూస్తున్నారు అంతా. ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన చూస్తే సినిమాపై కొంచెం సందేహాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 'బాహుబలి'ని బీట్ చేస్తుందా..? అన్న అనుమానాలు లేకపోలేదు. ఒకేవేళ ఇది ఫెయిల్ అయితే 'బాహుబలి' రికార్డ్స్ ఇంకా కొన్నాళ్ల పాటు ఎవరు టచ్ చేయలేరు. కానీ శంకర్ ని తక్కువ అంచనా వేయలేం. చూద్దాం ఏం జరుగుతుందో.