Mon Dec 23 2024 16:21:23 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ.. ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు : ఐశ్వర్య ధనుష్
ప్రేమ అనేది చాలా అద్భుతమైనదని ఐశ్వర్య పేర్కొన్నారు. అంత అద్భుతమైన ప్రేమ కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక వస్తువుకో
ప్రముఖ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో స్వస్తి పలికిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తామిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ దంపతులు. వారిద్దరూ విడిపోకుండా ఉండేందుకు.. రజనీకాంత్ ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్, చదువుల కోసమైనా కొన్నాళ్లు కలిసి ఉండాలని కోరినా.. అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తొలిసారి స్పందించారు.
ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమ అనేది చాలా అద్భుతమైనదని ఐశ్వర్య పేర్కొన్నారు. అంత అద్భుతమైన ప్రేమ కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక వస్తువుకో సంబంధించినది కాదని చెప్పారు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేస్తుకోవడం, వ్యక్తపరుచుకోవడమే ప్రేమ అని అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. తన మనసులో ప్రేమకు నిర్వచనం మారుతూ వచ్చిందని, ప్రేమ ఒక వ్యక్తితో మారిపోదని అన్నారు. ప్రస్తుతం తనకు తన తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని ఐశ్వర్య పేర్కొన్నారు.
Next Story