సూపర్ స్టార్ భలే బుక్ అయ్యాడు..!
ఈ సంక్రాంతికి మూడు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడానికి వచ్చాడు రజనీ. పోటీ చాలా గట్టిగా ఉన్నా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తనదైన స్టైల్, మేనరిజమ్స్ పెట్టుబడిగా [more]
ఈ సంక్రాంతికి మూడు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడానికి వచ్చాడు రజనీ. పోటీ చాలా గట్టిగా ఉన్నా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తనదైన స్టైల్, మేనరిజమ్స్ పెట్టుబడిగా [more]
ఈ సంక్రాంతికి మూడు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడానికి వచ్చాడు రజనీ. పోటీ చాలా గట్టిగా ఉన్నా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తనదైన స్టైల్, మేనరిజమ్స్ పెట్టుబడిగా పేటతో మన ముందుకు వచ్చారు. ఈసినిమా రిలీజ్ అవ్వడమే చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే మార్నింగ్ షోకే అంత సీన్ లేదని తేలిపోయింది. రజనీ కొత్తగా కనిపించినా అదే పాత చింతచిగురు పచ్చడిలా సినిమా ఉందని టాక్ వస్తుంది. దాంతో ఈ సినిమా పర్లేదు అన్న టాక్ సరిపెట్టుకుంది. రెండో రోజు స్క్రీన్స్ అన్ని దాదాపు తగ్గిపోవడంతో సినిమాకు మరింత మైనస్ అయింది.
తమిళంలో మాత్రం హిట్
దాంతో మొదటి రోజు ‘పేట’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.1.6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి షాక్ ఇచ్చింది. గతంలో రిలీజ్ అయిన కబాలి, 2.0 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ పేట కు తెలుగులో వాటిలో 20 శాతం కూడా రికవర్ చేయలేకపోయింది. పైగా ‘ఎఫ్-2’కు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో పేట వసూల్ మరింత తగ్గి సినిమాను కొన్న నిర్మాత అశోక్ వల్లభనేని కి, బయర్స్ కి నష్టం తప్పేలా లేదు. తమిళంలో మాత్రం రజనీ ఫ్యాన్స్ కు చాలా రోజులు తరువాత మంచి హిట్ వచ్చింది . కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ రజనీ పాత సినిమాలని కలిపి మళ్లీ తీసాడని ఫీలింగ్ వచ్చింది. తెలుగు లో ఈ సినిమా ఇంత డిజాస్టర్ అవ్వడానికి కారణం ప్రమోషన్స్ అసలు లేకపోవడమే.