Mon Dec 23 2024 14:20:45 GMT+0000 (Coordinated Universal Time)
శివాత్మిక సెకండ్ మూవీ కూడా ఓటీటీలోనే.. ఎందులో రానుందంటే?
రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రెండో చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు
రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక తొలిచిత్రంతో కాస్త ఫర్వాలేదనిపించుకుంది. తేజ సజ్జా - శివాత్మిక జంటగా నటించిన అద్భుతం సినిమా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. నిజానికి శివాత్మిక ఈ సినిమా కన్నా ముందు రెండు సినిమాల్లో నటించినప్పటికీ.. ఆ రెండు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో అద్భుతం సినిమానే శివాత్మిక తొలి చిత్రమయింది. రెండు విభిన్న కాలాల మధ్య ఉండే వారి మధ్యలో చిగురించే ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సోనీ సంస్థ....
కాగా.. తాజాగా శివాత్మిక నటించిన రెండో చిత్రాన్ని కూడా ఓటీటీ వేదికగానే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)' చిత్రంలో అదిత్ అరుణ్ - శివాత్మిక జంటగా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్'లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ సంస్థ ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
- Tags
- sivathmika
- ott
Next Story