తనను తానే ఇమిటేట్ చేసుకున్న రాజశేఖర్..!
ఒకల్ని ఒకరు ఇమిటేట్ చేయడం..వారిపై పంచులు వేయడం ఈ రోజుల్లో కామన్. అయితే తనపై తానే సెటైర్ వేసుకుంటేనే వెరైటీ. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది హీరో [more]
ఒకల్ని ఒకరు ఇమిటేట్ చేయడం..వారిపై పంచులు వేయడం ఈ రోజుల్లో కామన్. అయితే తనపై తానే సెటైర్ వేసుకుంటేనే వెరైటీ. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది హీరో [more]
ఒకల్ని ఒకరు ఇమిటేట్ చేయడం..వారిపై పంచులు వేయడం ఈ రోజుల్లో కామన్. అయితే తనపై తానే సెటైర్ వేసుకుంటేనే వెరైటీ. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేసినా సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో పవన్ ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అంటూ ఇమిటేట్ చేసిన సీన్ ఇంకా అందరికీ గుర్తే. ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. అలానే రాజశేఖర్ డాన్సింగ్ అంటే ఓ ట్రేడ్ మార్క్ స్టెప్పొకటి ఉంటుంది. ముఖ్యంగా ‘రోజ్ రోజ్ రోజపూవా’ సాంగ్ లో స్టెప్ అయితే చాలామంది సెలెబ్రెటీస్ ఇమిటేట్ చేసారు.
పాత డ్యాన్స్ మళ్లీ చేసిన రాజశేఖర్
అయితే ఇప్పుడు ఈ రెండిటినీ 'కల్కి' సినిమాలో చూపించాడు రాజశేఖర్. ఒక కమెడియన్ రాజశేఖర్ ముందు తన డాన్సు వేయడం ఆ డాన్స్ ని మళ్లీ రాజశేఖర్ ఇమిటేట్ చేయడం ఈ ట్రైలర్ లో కనిపిస్తాయి. అలానే తన డైలాగ్ ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అని రాజశేఖర్ ఫన్నీగా అనడం ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించాడు. గరుడ వేగతో మంచి ఫామ్ లో ఉన్న రాజశేఖర్ ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకోవడం ఖాయం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో రాజశేఖర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.