‘కల్కి’కి అంత డిమాండ్ ఎందుకు..?
‘గరుడవేగా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ [more]
‘గరుడవేగా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ [more]
‘గరుడవేగా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హోల్ సేల్ గా నిర్మాత కే.కే.రాధామోహన్ బడ్జెట్ పై 40శాతం ఎక్కువ చెల్లించి తీసుకున్నాడట. అలా ముందుగానే ‘కల్కి’ ప్రొడ్యూసర్స్ కు లాభాలు వెచ్చేసాయి. ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా అంతే దూకుడుగా ఉంది. టీజర్ కి ముందు 2 కోట్లకి అటు ఇటుగా చెప్పిన నిర్మాతలు టీజర్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు 2 కోట్ల పైనే చెబుతున్నారట.
రైట్స్ కోసం పోటాపోటీ
ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ జీవిత రాజశేఖర్ దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్. జీవిత కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ లలో ఒకరు. ఈ శాటిలైట్ రైట్స్ కోసం తెలుగులో మూడు పెద్ద ఛానెల్స్ పోటీ పడుతున్నాయి సమాచారం. అలానే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా ‘కల్కి’ రేటు భారీగానే పలుకుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రంగంలోకి దిగింది. మరోవైపు జీ గ్రూప్ కూడా ఈ సినిమా దక్కించుకుకోవాలి చూస్తుంది. ఈ బిజినెస్ అనుకుంది అనుకున్నట్టు జరిగితే రాజశేఖర్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయం.