Mon Nov 18 2024 01:22:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ మౌనానికి కారణం చెప్పిన రాజీవ్ కనకాల..
చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనానికి గల కారణం ఏంటో ఎన్టీఆర్ మిత్రుడు, యాక్టర్ రాజీవ్ కనకాల తెలియజేసాడు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ.. అరెస్ట్ ని ఖండించి, చంద్రబాబుకి మద్దతు తెలిపారు. తమిళ్ హీరో రజినీకాంత్, విశాల్ కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు. అయితే తెలుగు హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీని పై స్పందించలేదు.
దీంతో ఎన్టీఆర్ తీరు పై పలువురు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయినాసరి ఎన్టీఆర్ మాత్రం మౌనం వహిస్తూనే వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ మౌనం వెనుక కారణానికి.. పలు కారణాలు చెబుతూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ మిత్రుడు, యాక్టర్ రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్ మౌనానికి గల కారణం ఏంటో తెలియజేసాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనకాల దీనిపై మాట్లాడాడు.
రాజీవ్ కనకాల కామెంట్స్..
ఎన్టీఆర్ కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కరోనా, RRR వల్ల తన కెరీర్ లో నాలుగేళ్లు పైగా టైం పోయింది. ఆ గ్యాప్ లో తను మరో మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవరని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలు పైనే ఉంది. వాటితో బిజీ అవ్వడం వలనే రాజకీయాలు గురించి స్పందించడం లేదని అనుకుంటున్నాను. ఈ విషయం గురించి నా దగ్గర తను మాట్లాడలేదు. కానీ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తాడు.
గతంలో తను ఆల్రెడీ పార్టీ కోసం ప్రచారం చేశాడు. తన స్పీచ్ లు అందర్నీ ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండొచ్చు. కానీ వచ్చే అయిదేళ్ల తర్వాత ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం రాజకీయాలు పూర్తిగా నేర్చుకొని పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. అయితే అతని మౌనం విషయంలో కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారా..? లేదా నిజంగానే నెగటివిటీ వస్తుందా..? అనేది తెలియడం లేదు.
Next Story