Mon Dec 23 2024 15:29:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పిన చిరంజీవి, అల్లు అర్జున్
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో త్రీవ విషాదం
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో త్రీవ విషాదం చోటుచేసుకుంది. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి (38) ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాజేంద్రప్రసాద్ కుమార్తె హఠాన్మరణం చెందిందన్న వినకూడని మాట వినడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇంత బాధను నా మిత్రుడు ఎలా భరించగలడు? అనిపించింది. ఆ బిడ్డ చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడడం బాధాకరమన్నారు. రాజేంద్రప్రసాద్ వేదాంతిలా మాట్లాడుతుంటే ఎంతో వేదన కలిగింది. సగం జీవితం కూడా చూడని చిన్నవాళ్లు ఈ లోకాన్ని వదిలి వెళితే పెద్దవాళ్లకు కలిగే ఆ బాధ వర్ణనాతీతం. నా స్నేహితుడు రాజేంద్రప్రసాద్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని, మనందరినీ మళ్లీ నవ్వించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు చిరంజీవి.
రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం పట్ల అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తనకు నటుడిగా, వ్యక్తిగా ఎంతో ఆప్తులైన, అత్యంత ఇష్టుడైన రాజేంద్రప్రసాద్ గారికి ఇలాంటి కష్టం రావడం దురదృష్టకరమని, గాయత్రి మరణం చాలా విషాదకరమని అల్లు అర్జున్ తెలిపారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

Next Story