Mon Dec 15 2025 00:11:38 GMT+0000 (Coordinated Universal Time)
జైలర్ సినిమా బాగాలేదన్న విజయ్ అభిమాని.. ఏమయ్యాడంటే?
హిట్ టాక్ తో దూసుకుపోతూ ఉన్నాయి. రజనీకాంత్ సూపర్ స్టైలిష్

రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తో దూసుకుపోతూ ఉన్నాయి. రజనీకాంత్ సూపర్ స్టైలిష్ లుక్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ గా మారాయి. జైలర్ సినిమా బాలేదని కామెంట్ చేసిన ఒక విజయ్ అభిమానిని రజనీ అభిమానులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. గత కొన్నాళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీ- విజయ్ అభిమానుల మధ్య వివాదం నడుస్తోంది. జైలర్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో మాట్లాడిన రజనీ కాకి, డేగను పోలుస్తూ ఓ కథ చెప్పాడు. ఆ కథలో ఆయన చెప్పిన కాకి నటుడు విజయ్ అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. సినిమాకు భారీగా అభిమానులు తరలి వెళ్లారు. అన్ని షోస్ హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. క తమిళనాడు చెన్నైలోని వెట్రి థియేటర్ లో 9 గంటలకు తొలి షోను ప్రదర్శించారు. ఈ సినిమా చూసేందుకు విజయ్ అభిమానులు కూడా వచ్చారు. థియేటర్లో రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. సినిమా బాగాలేదని విజయ్ అభిమానిని కొట్టారు. విజయ్ అభిమానులు థియేటర్ నుంచి బయటకు వచ్చి రజనీకి వ్యతిరేకంగా కేకలు వేయడంతో అతనిని వెంబడించి థియేటర్ తలుపు వద్ద కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Next Story

