Sun Nov 24 2024 22:15:17 GMT+0000 (Coordinated Universal Time)
Rajinikanth : ‘అర్థమైందా రాజా’.. అని నేను అన్నది వాళ్ళని కాదు..
మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. అర్థమైందా రాజా.. అని తాను అన్నది వాళ్ళని కాదంటున్న రజినీకాంత్.
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత కొన్ని నెలలు క్రిందట 'జైలర్' ఆడియో లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చినీయాంశం అయ్యాయి. ఇంతకీ ఆ మాటలు ఏంటంటే.. "మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండు లేని ఊరు లేదు. కాబట్టి మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా" అంటూ వ్యాఖ్యానించారు.
ఇక రజినీకాంత్ ఈ మాటలు.. హీరో విజయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారని తమిళంలో, లేదు ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులను ఉద్దేశించి అన్నారని తెలుగులో విపరీతంగా చర్చలు జరిగాయి. తాజాగా దీని పై రజినీకాంత్ రియాక్ట్ అవుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. 'లాల్ సలామ్' ఆడియో లాంచ్ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాతూ.. "నేను జైలర్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు విజయ్ ని అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. విజయ్ ని నేను చిన్నప్పటి నుంచి చూస్తునాను. నా కాళ్ళ ముందే పెరిగిన విజయ్.. ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగాడు. అలాంటి తనని నేను ఎందుకు కామెంట్స్ చేస్తాను" అంటూ పేర్కొన్నారు.
అలాగే అభిమానులకు ఒక సూచను కూడా ఇచ్చారు. తమ ఇద్దర్ని పోల్చి చూడకండి అంటూ పేర్కొన్నారు. అసలు విజయ్-రజినీ గొడవ ఏంటంటే.. రజినీ సూపర్ స్టార్ ట్యాగ్ ని విజయ్ కి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ తమిళనాట రచ్చ చేస్తున్నారు. దానికి రజినీ అభిమానులు కూడా ఎదురు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే రజినీ ఆ కామెంట్స్ చేయడంతో.. విజయ్ నే అన్నారని ఫ్యాన్స్ చిత్రీకరించారు.
ఇక వైసీపీ విషయం ఏంటంటే.. విజయవాడ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజినీకాంత్ పై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శల పై తమిళ రజినీ అభిమాన సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఆ విమర్శలకే రజినీ కౌంటర్ ఇస్తూ ఆ కామెంట్స్ చేసారని తెలుగు వారు కామెంట్స్ చేస్తూ వచ్చారు.
Next Story